Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సోయాబీన్, మినుము, కంది పంటల పరిశీలన

సోయాబీన్, మినుము, కంది పంటల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని నాగుల్గావ్ గ్రామంలో గ్రామ సభలో వ్యవసాయ విస్తరణ అధికారి సతీష్ చిద్రవార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సేల్ అనే యాప్ పై, నీటి కుంటలు, ఆయిల్ ఫామ్ పంటలపై రైతు సోదరులకు అవగాహన కల్పించారు. తరువాత క్షేత్ర స్థాయిలో సోయాబీన్, మినుము, కంది పంటలను పరిశీలించి రైతు సోదరులకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. మినుము పంటలో ప్రధానంగా మొజాయిక్ తెగుళ్ళు. ఇది తెల్ల దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. దీని నివారకు వేపనూనె 1500 ppm 500ml ఎకరాకు + ఫిప్రోనిల్ 200ml ఎకరాకు కలిపి పిచికారి చేయాలని సూచించారు. మినుము పంటలో ఐరన్ లోపం కూడా గమనించి దీని నివారణకు ఫార్ములా 6@200గ్రాములు ఎకరాకు కలిపి పిచికారి చేయాలని వివరించారు.

     సోయాబీన్ పంటలో ప్రధానంగా పచ్చ పురుగు, కాండపు పురుగు ( Stem girdle) గమనించి దాని నివారణకు ఏమమెక్టిన్ బెంజోయేట్ ( EM 1) 100 గ్రాములు ఎకరాకు ఉదృతి ఎక్కువగా ఉన్నపుడు ఫ్లుబెండిమిడ్ ( Takumi) 100గ్రాములు ఎకరాకు +13.0.45@1kg ఎకరాకు పిచికారి చేయాలని సూచించడం జరిగింది. ఆకుమచ్చ తెగులు నివారణకు Mancozeb & Carbendizum (Saaf) 400గ్రాములు ఎకరాకు లేదా Propiconazole ( టిల్ట్) 200ml ఎకరాకు 200 లీటరు ల నీటిలో కలిపి పిచికారి చేయాలని తెలిపారు.

కంది పంటలో ప్రధానంగా ఎండు తెగులు గమనించి దాని నివారకు కాపర్ ఆక్స్ క్లోరైడ్ COC 3 గ్రాములు లీటరు నీటికి అనగా 600 గ్రాములు ఎకరాకు + 13.0.45@ 1kg ఎకరాకు కలిపి పిచికారి చేయాలని చెప్పారు. ఈరోజు క్షేత్ర స్థాయి సందర్శనలో రైతు సోదరులు శివరాం శివాజీ పటేల్, జెట్టి విశాల్ గారు, కాంబ్లె మిలింద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -