నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక వ్యవసాయ కళాశాలలో బుధవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు, వాలంటీర్లు, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి, దేశ స్వాతంత్ర్యం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం దేశ ప్రగతి, సమైక్యత, సౌభ్రాతృత్వాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
తదుపరి పచ్చదనం, పరిశుభ్రత ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఆవరణలోని ఉద్యానవనం, జిమ్ ప్రాంతాలను శుభ్రం చేస్తూ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలిపారు. కళాశాలలోని ప్రతి విద్యార్థి, అధ్యాపకుడు కార్యక్రమంలో పాల్గొని తమ బాధ్యతలను నిర్వర్తించాలని, పరిశుభ్రతను పాటించాలని, జాతీయ నాయకుల సేవలను స్మరించుకోవడంతో పాటు తిరంగా ర్యాలీలో పాల్గొనాలని వారు సూచించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే. హేమంత కుమార్, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ రాములు, డాక్టర్ జమీమా, డాక్టర్ నీలిమ, డాక్టర్ రమేష్, డాక్టర్ జంబమ్మ, శివ హాజరై ఎన్ఎస్ఎస్ వాలంటీర్లను అభినందించి ప్రోత్సహించారు.



