సిరిసిల్ల కోర్టులో ఘటన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ భవనంలో కొనసాగుతున్న కోర్టులో బుధవారం లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో పలువురు న్యాయవాదులు అందులో చిక్కుకుపోయారు. ప్రిన్సిపల్ కోర్టు, అడిషనల్ కోర్టుల్లో తమ విధులు నిర్వహించేందుకు వచ్చిన న్యాయవాదులు లిఫ్ట్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచే సుకుంది. లిఫ్ట్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో అందులో ఉన్న న్యాయవాదులు కొంతసేపు లోపలే ఉండిపోయారు. విషయం గుర్తించిన భవన సిబ్బంది వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకుని లిఫ్ట్‌లో చిక్కుకున్న న్యాయవాదులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కోర్టులు కొనసాగుతున్న భవనంలో లిఫ్ట్ నిర్వహణ, భద్రతా ప్రమాణాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని న్యాయవాదులు కోరుతున్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా లిఫ్ట్‌ను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.
లిఫ్ట్ లో చిక్కుకున్న న్యాయవాదులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



