పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం
డీన్ ప్రొఫెసర్ ఉదయ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థులు విషయ పరిజ్ఞానంతో పాటు శస్త్రచికిత్సలో నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాలని పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం డీన్ ప్రొఫెసర్ ఉదయ్‌కుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల పీవీ. నర్సింహారావు తెలంగాణ వశువైద్య విశ్వవిద్యాలయం, పశువైద్య కళాశాల రేడియాలజీ విభాగం ఆధ్వర్యంలో చివరి సంవత్సరం విద్యార్థులు, క్షేత్ర పశువైద్యులకు జంతువుల ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలో జ్ఞాన, నైపుణ్యాభివృద్ధి ద్వారా జీవనో పాధి, ఔత్సాహికతాభివృద్ధి’అనే అంశంపై నిర్వహిస్తున్న ఐదు శిక్షణా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంపానియన్ జంతువుల వైద్యంలో పెరుగుతున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు స్వయం ఉపాధి దిశగా కూడా ముందుకు సాగాలనీ, ఇటువంటి నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు భవిష్యత్తులో ఉత్తమ పశువైద్య నిపుణు లుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ ప్రొఫెసర్ మాధురి మాట్లాడుతూ.. విద్యార్థుల కు నాణ్యమైన విద్యతో పాటు ప్రాయోగిక శిక్షణ అందించడం విశ్వవిద్యాలయం ప్రధాన లక్ష్యమని తెలిపారు. శిక్షణా కార్యక్రమ ప్రధాన పరిశోధకులు, సమన్వయకర్త ప్రొఫెసర్ జె. రాధాకృష్ణారావు స్వాగతోపన్యాసం చేస్తూ… శిక్షణలో ఆధుని క శస్త్రచికిత్సా విధానాలు, క్లినికల్ నైపుణ్యాలు, ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రవళి, లత, సిహెచ్, సత్యనారాయణ. ప్రవళిక, దినేష్, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
శస్త్రచికిత్సలో నైపుణ్యాలను పెంచుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



