Thursday, August 13, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ జౌళి రంగానికి చేయూత

తెలంగాణ జౌళి రంగానికి చేయూత

- Advertisement -

శ్రీరామ్ ఫైనాన్స్ ‘శ్రీ సంపర్క్’ ప్రారంభం
న‌వ తెలంగాణ – హైద‌రాబాద్‌

తెలంగాణలో విస్తరిస్తున్న ‌వస్ర్త, జౌళి పరిశ్రమ పురోగతికి తోడ్పాటు అందించేందుకు ప్రముఖ బ్యాంకింగేతర విత్త సంస్థ (ఎన్‌‌బిఎఫ్‌‌సి) శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ‘శ్రీ సంపర్క్’ పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చింది. జౌళి రంగానికి చెందిన వ్యాపార యజమానులు, తయారీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులకు అవసరమైన మూలధన సదుపాయంతో పాటు వ్యాపార వృద్ధి వ్యూహాలపై అవగాహన కల్పించడమే ఈ వేదిక ప్రధాన లక్ష్యమని శ్రీరామ్ ఫైనాన్స్ తెలంగాణ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ వి. ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌‌లో ఏర్పాటు చేసిన శ్రీరామ్ ఫైనాన్స్ ‘శ్రీ సంపర్క్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తమ సంస్థ పురోగతిని ఆయన వివరించారు. వ్యాపారులు పరస్పరం ఆలోచనలు పంచుకోవడానికి, నెట్‌వర్కింగ్ పెంచుకోవడానికి, సుస్థిర ఆర్థిక సాధికారత సాధించడానికి శ్రీ సంపర్క్ ఒక శక్తివంతమైన వేదికగా ఉపయోగపడుతుందన్నారు.
ప్రస్తుతం రూ.3 ట్రిలియన్లకు పైగా నిర్వహణలోని ఆస్తులతో (ఎయుఎం) దేశంలోనే అతిపెద్ద రిటైల్ అసెట్ ఫైనాన్సింగ్ ఎన్బీఎఫ్సీలలో ఒకటిగా ఉందన్నారు. గత 47 ఏళ్లుగా చిన్న వ్యాపారులు, వాహనదారుల అవసరాలను తీరుస్తున్న తమ సంస్థ దేశవ్యాప్తంగా 3,225 శాఖల ద్వారా కమర్షియల్ వాహనాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, బంగారం రుణాలు మరియు వర్కింగ్ క్యాపిటల్ రుణ సేవలను అందిస్తోందని తెలిపారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో హైదరాబాద్, పోచంపల్లి, గద్వాల వంటి ప్రముఖ జౌళి కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తోన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమలోని అన్ని వర్గాల వ్యాపారులకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించేందుకు సంస్థ కట్టుబడి ఉందని శ్రీరామ్ ఫైనాన్స్ తెలిపింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత, జౌళి అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వెంకట రమణ ముఖ్య అతిథిగా, చేనేత కార్మికుల సహకార సంఘం సహాయ సంచాలకులు (ఫైనాన్స్) జె. కాళింగ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జౌళి పరిశ్రమ భవిష్యత్తు, వృద్ధి అవకాశాలపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో వి. ప్రవీణ్, కల్పనా రావు, పల్లవి జోషి, ప్రకాష్ అమ్మనబోలు, లవకుమార్ భారత్ తదితర నిపుణులు పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్‌ ‌ఫైనాన్స్‌ ప్రాడక్ట్ హెడ్స్ సతీష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి సహా 100కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, వ్యాపార నిపుణులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -