Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత పథకాల అమలు, వాటి ఆర్థిక భారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ ధర్మాసనం… చట్టబద్ధమైన ప్రక్రియ, అసెంబ్లీ తీర్మానం లేకుండా కేవలం జీవోల ఆధారంగానే ప్రజాధనాన్ని వెచ్చించే పథకాలను ఎలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నాలుగు వారాలు గడిచినా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ పథకాల అమలుపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు మధ్యంతర ‘స్టే’ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -