Thursday, August 13, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘ఇరుముడి’ సినిమా కాదు.. ఓ గొప్ప ఎమోషన్‌

‘ఇరుముడి’ సినిమా కాదు.. ఓ గొప్ప ఎమోషన్‌

- Advertisement -

హీరో రవి తేజ నటించిన ‘ఇరుముడి’ చిత్రం ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, పాటలతో ఇప్పటికే చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు చిత్ర నిర్మాతలు తెలుగు, తమిళ భాషలలో విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో ఉత్సాహాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లారు. భీమవరంలో గ్రాండ్‌గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో రవితేజ మాట్లాడుతూ,‘నాకు భీమవరంతో మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో దాదాపు ఎనిమిది నెలల పాటు కేవలం సినిమాలు చూడటానికే భీమవరంలో ఉన్నాను. మీతో పాటు ట్రైలర్ నేను కూడా ఈరోజే చూశాను. మీ అందరికీ ట్రైలర్ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉంది. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది’ అని తెలిపారు. ‘ట్రైలర్‌లో ఉన్నదానికి పదింతలు సినిమాలో ఉంటుంది. ఈ ట్రైలర్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ‘ఇరుముడి’ టైటిల్ ప్రకటించగానే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అద్భుతమైన వైబ్రేషన్ వచ్చింది.

ఆ రోజు నుంచి ఈరోజు వరకు అదే వైబ్రేషన్, అదే ప్రేమ చూపిస్తున్నారు. మీ ప్రేమ నాపై మరింత బాధ్యతను పెంచింది. ‘ఇరుముడి’ అంటే ఇద్దరికి పడిన ముడి. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ముడి.. అయ్యప్ప స్వామికి, ఆయన భక్తుడికి మధ్య ఉన్న ముడి.. అలాగే ఈ సినిమాలో ఉన్న ఒక క్రైమ్ చిక్కుముడి. ఈ మూడు చిక్కుముడులను కలిపి ‘ఇరుముడి’ అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ మూడు అంశాలను ఒక ఫ్యామిలీ డ్రామాలో కలిపి తీసుకురావడం ద్వారా సినిమా ఇచ్చే ఇంటెన్సిటీ మిమ్మల్ని అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది. విజయ్ ఈ సినిమా ట్రైలర్‌ను చాలా అద్భుతంగా కట్ చేశాడు. రవితేజ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. ‘ఇరుముడి’ కేవలం ఒక సినిమా కాదు.. ఇది ఒక గొప్ప ఎమోషన్’ అని డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ,‘రవితేజ నా కజిన్.

స్టార్ అవ్వాలని సంకల్పంతో ఎవరి సహాయం లేకుండా తన కష్టంతో పైకి వచ్చిన రియల్ హీరో మా రవితేజ. నాకు చాలా గర్వంగా అనిపిస్తోంది. మన జిల్లా గొప్పతనం ఏంటంటే కృష్ణంరాజు, ప్రభాస్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎంతోమంది అద్భుతమైన హీరోలుగా రాణించారు. మైత్రీ మూవీ మేకర్స్ నాకు ఎంతో ఆప్తులు. ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా రవితేజకి మరో పెద్ద హిట్ అవుతుంది’ అని అన్నారు. ప్రియ భవానీ శంకర్ మాట్లాడుతూ,‘నాకు కావేరి పాత్ర ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణకి ధన్యవాదాలు. నక్షత్ర చాలా టాలెంటెడ్. తన నటన మీ అందరికీ నచ్చుతుంది. రవితేజతో సినిమాలో పనిచేయడం నాకు చాలా స్పెషల్. కచ్చితంగా ఇది రవితేజకి మోస్ట్ మెమొరబుల్ ఫిల్మ్ అవుతుంది’ అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -