Friday, August 14, 2026
E-PAPER
Homeజాతీయంకరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట..

కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ఊరట..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ గత నెల మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులపై స్టే శుక్రవారం విధించింది. దీంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే నిర్ణయానికి తాత్కాలికంగా ఊరట లభించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -