- Advertisement -
నవతెలంగాణ ఆర్మూర్: రోడ్డుపై ప్రమాదానికి గురైన జాతీయ పక్షి నెమలిని ఆర్మూర్ ఫారెస్ట్ రేంజ్ అధికారులు రక్షించినారు. వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామ రహదారిపై శుక్రవారం నెమలి ప్రమాదానికి గురికాగా,స్థానికులు సమాచారం అందించారు. దీంతో ఎఫ్ఆర్ఓ బి.ఆరుణ్ కుమార్, డిప్యూటీ ఎఫ్ ఆర్ ఓ శ్రీదేవి, ఫారెస్టు కార్యాలయానికి తీసుకొచ్చి చికిత్స అందించినారు. వీరితోపాటు, ఎఫ్ఆర్ఓ కార్యాలయ సిబ్బంది, డ్రైవర్ సాజిద్ తదితరులు ఉన్నారు.
- Advertisement -


