- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల ఎన్రోల్మెంట్ను నిలిపివేస్తూ బార్కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ఇచ్చిన ఆదేశాలపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బీసీఐ ఆ ఆదేశాలను గురువారం వెనక్కి తీసుకొంది. ఈసందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. తాను కూడా విద్యార్థి దశలో చేపట్టిన నిరసనల్లో పాల్గొనేవాడినన్నారు. శాంతియుతంగా గళాన్ని వినిపిస్తే అనుమతించాలని సూచించారు. విద్యార్థులకు నిరసన తెలిపే హక్కు ఉందని, ఎన్రోల్ చేసుకోవాలన్నారు. విద్యార్థులకు సుప్రీంకోర్టు అండగా ఉంటుందని సీజేఐ అభయం ఇచ్చారు.
- Advertisement -



