Friday, August 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రెవిన్యూ అధికారులను అడ్డుకున్న తోటపల్లి రైతులు 

రెవిన్యూ అధికారులను అడ్డుకున్న తోటపల్లి రైతులు 

- Advertisement -

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామ శివారులోని బస్టాండ్ వద్ద ఉన్న సర్వేనెంబర్  444 లో ఉన్న ప్రభుత్వ భూమిలో మార్కెట్ యార్డ్ నిర్మించేందుకు అధికారులు  సర్వేర్  లక్ష్మీనారాయణ ఆర్ ఐ రాజయ్య, జిపిఓ సర్వే చేసేందుకు శుక్రవారం రావడంతో  గ్రామానికి చెందిన రైతులు అధికారులు అడ్డుకున్నారు. పేదలైన మాకు అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం  భూమి పంపిణీ చేసిందని అలాంటి భూమిని ఎలా తీసుకుంటారని అధికారులను నిలదీశారు. ఏళ్ల తరబడి మా భూమిని దున్నుకుంటున్నామని తెలిపారు. ఉన్నత అధికారులు సర్వే చేయమంటేని వచ్చామని రైతులతో అధికారులు చెప్పినప్పటికీ వినకుండా అడ్డుపడ్డారు. మా భూమిలో మార్కెట్ యార్డ్ నిర్మించవద్దని రైతులు  అధికారుల సర్వే చేయకుండా అడ్డుకోవడంతో తిరిగి వెళ్ళిపోయారు. నిరసన కార్యక్రమంలో రైతులు కోడముంజ చంద్రయ్య, వెంకటేష్ కుమార్ రాజయ్య నరసవ లక్ష్మీ వసంత శంకర్ లక్ష్మి మహేందర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -