నవతెలంగాణ-నవాబు పేట
80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సురేష్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయరాం నాయక్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ నరెందర్ ఎంఆర్సి భవనంలో ఎంఈఓ నాగ్య నాయక్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గీతారాణిసుధాకర్ చారి, ఐకేపీ కార్యాలయంలో మహిళా అధ్యక్షురాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావణ్ కుమార్ మార్కెట్ యార్డులో చైర్మన్ హరలింగం ముదిరాజ్ పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ మాడెమోని నర్సింహులు అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాణెం సుధాకర్ బీఆరెస పార్టీ అధ్యక్షుడు నర్సింలు, బీజేపీ పార్టీ అధ్యక్షుడు లక్ష్మి నారాయణ తమ పార్టీ నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
దీంతో పాటు వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీల్లో ఆయా గ్రామాల సర్పంచ్లు,ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రైవేటు పాఠశాలల్లో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, పెద్దలు, విద్యావంతులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమర యోధుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీలుస్తూ స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను, వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దేశం పట్ల బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
ముఖ్యంగా యువత, విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తి, నైతిక విలువలను అలవర్చుకుని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేలా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తూ ఐకమత్యం, దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ భద్రు నాయక్ డిప్యూటీ తహశీల్దార్ సువర్ణ గిర్దావారులు రామాంజనేయులు సీనియర్ అసిస్టెంట్లు నారాయణ జ్యోతి సూపరింటెండెంట్ తేజశ్విని సూపరింటెండెంట్ గోవింద రెడ్డి ఏపీఎం శ్రీహరి ఏపీఓ జ్యోతి జూనియర్ అసిస్టెంట్ మణికంఠ ఉపసర్పంచ్ హజహర్ అలీ సిబ్బంది గోపాల్ సత్యం బాల్ రాజ్ ఆయా గ్రామాల జీపీఓ లు ఆయా పార్టీల నాయకులు కార్యకర్తలు యువత తదితరులు పాల్గొన్నారు.



