పెద్దఎడ్గి హెల్త్ సబ్ సెంటర్ ను జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం పరీశీలన..

నవతెలంగాణ – జుక్కల్
 మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములో ప్రాథమీక ఆరోగ్య సబ్ సెంటర్, పల్లేదవఖానా ను జాతీయ నాణ్యత ప్రమాణాల బృందం వైద్యుల బృందం చేపట్టిన పనులను సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతీయ స్థాయి గుర్తింపు వారి వద్ద ఉన్నటువంటి చెక్ లిస్ట్ అనుగుణంగా తల్లిపిల్లల సేవలు, నవజాత శిశువు సంరక్షణ , యువ క్లినిక్ సేవలు, కుటుంబ సంక్షేమం, కుటుంబ నియంత్రణ, సంక్రమణ, అసంక్రమణ వ్యాదులు, ప్రథమ చికిత్స రెపరల్ సేవలు, జాతీయ కార్యక్రమాల పై ఉన్నటువంటి రికార్డులను పరీశీలించారు. ఈ కార్యక్రమంలో జాతీయ గుర్తింపు బృందం వైద్యుడు విజయ్ కూమార్, సయ్యద్ ఫరిదోద్దిన్, జిల్లా వైద్యాదికారీ డా’ లక్ష్మన్ సింగ్, ఉప వైద్యాదికారీ డా” శీరీష, డీపీవో పద్మజా, నాణ్యత జిల్లా మేనేజర్ జహేరా, వేణుగోపాల్, డీహెచ్ఈ దస్తీరాం, జుక్కల్ వైద్య బృందం, సిబ్బంది,  తదితరులు పాల్గోన్నారు.

Spread the love