హుస్నాబాద్ ఆర్టీసీలో వన భోజన మహోత్సవాలు

– డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు 
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
 ఆర్టీసీ ఉద్యోగులు ఎప్పుడూ వారి విధి నిర్వహణలో భాగంగా తీరిక లేకుండా కష్టపడుతున్నారనే ఉద్దేశ్యం తో గురువారం ఆర్టీసీ ఉద్యోగులకు వన భోజన కార్యక్రమం నిర్వహించినట్లు డిపో మేనేజర్  వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ..  రెండు విడతలుగా ఈ వనభోజనాలు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందన్నారు. మొదటి విడత లో బాగంగా డిపోలో ఉద్యోగులు అందరూ ఆట పాటలతో చాలా సరదాగా గడిపినట్లు పేర్కొన్నారు.  ఉద్యోగులకు  నవంబర్ మరియు డిసెంబర్ మాసం లో వారి విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి బెస్ట్ ఈ పీకే, బెస్ట్  కే ఎం పి ఎల్  అవార్డ్ లు ప్రధానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు ,సూపర్డెంట్ శ్రీధర్ , ట్రాఫిక్ సూపర్డెంట్ నర్సయ్య, సమ్యూల్ ,అకౌంట్స్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love