పాఠశాలకు ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ విరాళంగా అందజేత

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని కోనాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ విరాళంగా అందజేశారు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి గిరీష్ రావు ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ ను పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. పాఠశాలకు విరాళంగా అందించిన  ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ విలువ సుమారు రూ. లక్ష 15 వేలు ఉంటుందని వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధి గిరీష్ రావు తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలన్న సదుద్దేశంతో ఈ ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ అందించినట్లు తెలిపారు. పాఠశాలకు ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ విరాళంగా అందించిన వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులకు పాఠశాల, గ్రామస్తుల తరఫున ఉప సర్పంచ్ టేకుల జలంధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ చిన్నారెడ్డి, విండో డైరెక్టర్ చిన్నారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love