పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం 2024 క్యాలెండర్ ను గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పిటిసి రంగు కుమార్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పిఆర్టియు సంఘం ఎప్పుడు ముందుంటుంది అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జరిపేద విద్యార్థులకు సంఘం అండగా నిలవడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ ఈ బి కార్యదర్శి గారె కృష్ణమూర్తి, సంఘం నాయకులు అంజయ్య, రవీందర్, రఘు, స్వామి, ప్రవీణ్ రెడ్డి, ప్రభాకర్, దేవేందర్, శర్మ, యాకన్న, రోజారాణి, ప్రణిత, మమత, నవమణి, కోమల,స్వప్న, లక్ష్మి, స్వర్ణ , శోభ తదితరులు పాల్గొన్నారు.