Sunday, August 16, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇండోనేషియాలో భూకంపం.. 47కు చేరిన మృతుల సంఖ్య

ఇండోనేషియాలో భూకంపం.. 47కు చేరిన మృతుల సంఖ్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇండోనేషియాలో శనివారం సంభవించిన భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 47కు చేరినట్లు అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 2 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో పాటు పలు రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో సహాయక, సహాయ చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. ఇదిలా ఉండగా, నిన్న సాయంత్రం మరోసారి భూకంపం సంభవించినప్పటికీ తీవ్రత తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -