Sunday, August 16, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఝార్ఖండ్​లోని లాతెహార్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ భారీ ట్రక్కు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టింది. చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘దేద్ తంగవా’ లోయలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్రక్కు అదుపుతప్పి, ఆటోను, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ఘటనలో చిన్నారి సహా ఆరుగురు చనిపోయారు. సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -