- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మమతా బెనర్జీకి సన్నిహితుడు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ అనుమానాస్పద స్థితిలో పార్టీ కార్యాలయంలో మృతి చెందారు. ఆయన మృతదేహం కార్యాలయంలోని ఓ గదిలో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాంపూర్హట్ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
- Advertisement -



