నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల: రుద్రంగి పోలీస్ స్టేషన్ లో నమోదైన వరకట్నం వేధింపు హత్య కేసులో భర్తతో పాటు మరో ఇద్దరికి జీవిత ఖైదు విధించినట్లు గురువారం సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ మహేష్ బిగితే పేర్కొన్నారు.
ఎస్పీ కథనం ప్రకారం…రుద్రంగి గ్రామానికి చెందిన ఏనుగందుల రాజయ్యకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె హేమలత (పద్మ)ను అదే గ్రామానికి చెందిన సింగారపు జనార్ధన్‌కు కట్నాలు, కానుకలు ఇచ్చి వివాహం చేశారు. అయితే, వివాహం జరిగిన కొద్ది రోజుల తరువాత అదనపు కట్నం తీసుకురావాలని భర్త సింగారపు జనార్ధన్, ఆడపడుచు సింగారపు శారద, మేనల్లుడు తెడ్డు సాగర్, అలాగే జనార్ధన్ అన్న కుమార్తె సింగారపు దివ్య కలిసి హేమలతను వేధించడం ప్రారంభించారు.
ఈ విషయంపై గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించగా, ఇకపై హేమలతను బాగా చూసుకుంటానని జనార్ధన్ హామీ ఇచ్చి, ఆమెను తిరిగి తనతో కాపురానికి తీసుకెళ్లాడు.3 ఏప్రిల్2018 న మళ్ళీ అదనపు వరకట్నం తీసుకొని రావాలని వేధించాడు.అ విషయంలో గొడవ జరుగగా నలుగురు కలిసి హేమలతను కొట్టి చంపాలనే ఉద్దేశంతో రోకలి బండతో తల పైన కొట్టి చంపారు.ఈ కేసు లొ మృతురాలు తమ్ముడు ఏనుగుందుల సతీష్ పిర్యాదు మేరకు అప్పటి రుద్రంగి ఎస్.ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు, ఈ కేసు లొ అప్పటి డిఎస్పీ వెంకటరమణ కోర్ట్ లొ ఛార్జిషిట్ దాకాలు చేయగా, కేసులో ప్రాసిక్యూషన్ తరుపున పెంట శ్రీనివాస్ వాదించగా చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, ఎస్సై రవీందర్ నాయడు ఆధ్వర్యంలో కోర్ట్ లో 19 మంది సాక్షులను ప్రవేశ పెట్టగా కేసు పూర్వ పరాలు పరిశీలిచిన తరువాత సిరిసిల్ల జిల్లా ప్రధాన నాయమూర్తి నీరజ నిందుతులకు ఒక్కొక్కరికి జీవిత ఖైదు తో పాటు ఒక్కొక్కరికి 2000/-లు జరినామా విధించారు.
ఈ కేసులో వంటి సింగరపు దివ్య మైనర్ కావడం వలన ఆమె పైన కేసు ప్రస్తుతం జూవినల్ కోర్ట్ లో నడుస్తుంది.
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు,ప్రాసిక్యూషన్ వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. పైకేసులలో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీలు పెంట శ్రీనివాస్, చందుర్తి సి.ఐ వెంకటర్వర్లు, ఎస్సై రవీందర్ నాయడు,కోర్ట్ మానిటీరింగ్ కానిస్టేబులు నవీన్, లతీఫ్, శ్రీనివాస్ లు అప్పటి పోలీస్ అధికారులు ఎస్ఐ, డిఎస్పీలను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.



