- Advertisement -
- బహుజన వాదం దిగి దొరవాదం ఎక్కింది
- తలమీద బోడిగుండు తప్ప మెదడు లేకుండా పోయింది
- మా నేతలపై నోరు జారే ముందు జాగ్రత్తగా ఉండాలి
- నాడు బీఆర్ఎస్ అక్రమాలపై నోరు విప్పి, నేడు మరిచిపోయావా
- మేడ్చల్ నియోజకవర్గానికి పట్టిన శని మల్లారెడ్డి
- స్వంత ఆస్తులపై ధ్యాసే తప్ప ప్రజా సమస్యలపై పట్టింపే లేదు
- మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వజం
నవతెలంగాణ-బోడుప్పల్: నాడు బహుజన వాదంతో అనేక సిద్ధాంతాలు వల్లె వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు నేడు దొరల గడిలో ఉద్యోగం దొరకగానే దొర బానిసగా మారారని కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మండిపడ్డారు. సోమవారం బోడుప్పల్ సర్కిల్ పీర్జాదిగూడ డివిజన్లోని బండి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మాట్లాడారు. గత మూడు రోజుల క్రితం మేడ్చల్ నియోజకవర్గంలోని బొమ్మరాశిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై వారు తీవ్రంగా స్పందించారు. బహుజన ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ప్రవీణ్ కుమార్… బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆ పార్టీ నేతల భాషనే మాట్లాడుతున్నారని, బహుజన వాదాన్ని పక్కనపెట్టి పూర్తిగా దొరల వాదానికి లొంగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. “తలపై బోడిగుండు తప్ప, ఆలోచించే మెదడు మిగల్లేదా” అంటూ నేరుగా ఆయనపై విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ నేతలపై నోరు జారే ముందు ప్రవీణ్ కుమార్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై గళం విప్పిన ఆయనే ఇప్పుడు ఆ విషయాలను మరచిపోయి కాంగ్రెస్‌పై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండి, ప్రతిపక్షంలోకి వచ్చాక అక్రమాలను గుర్తు చేసుకోవడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపైనా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మేడ్చల్ నియోజకవర్గానికి మల్లారెడ్డి రూపంలో శని పట్టిందని వ్యాఖ్యానిస్తూ, ఆయనకు స్వంత ఆస్తులు, వ్యాపారాలపై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎన్నడూ కనిపించలేదని ఆరోపించారు. ఏళ్ల తరబడి ప్రజాప్రతినిధిగా ఉన్నా మేడ్చల్ ప్రాంత మౌలిక సదుపాయాలు, తాగునీరు, రహదారుల వంటి ప్రాథమిక సమస్యలు పరిష్కారం కాకుండానే మిగిలిపోయాయని, ఆస్తుల కూడబెట్టుకోవడంపై చూపిన శ్రద్ధలో కాస్తయినా ప్రజా సమస్యలపై చూపి ఉంటే నియోజకవర్గం ఈపాటికే అభివృద్ధి చెంది ఉండేదని విమర్శించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పోచారం,పీర్జాదిగూడ, మేడిపల్లి డివిజన్ అధ్యక్షులు కర్రె రాజేష్, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి, మాజీ గ్రంథాలయ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగు జలెందర్ రెడ్డి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగొండ రమేష్, ఎన్‌కేఎన్ దుర్గా, మణిరాం నాయక్,కర్రె బాల్ రాం,సుక్క జయేందర్ లతో పాటు
కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -



