Monday, August 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పిఏసిఎస్ లో గోల్డ్ అప్రైజర్ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

పిఏసిఎస్ లో గోల్డ్ అప్రైజర్ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పిఏసిఎస్) కార్యాలయంలో గోల్డ్ లోన్ కార్యకలాపాల నిర్వహణ కోసం గోల్డ్ అప్రైజర్ పోస్టును భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించబడుతాయని సిఈఓ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దరఖాస్తుదారు స్వర్ణకారుల సమాజానికి చెందిన వ్యక్తియై ఉండాలి,బంగారు ఆభరణాల స్వచ్ఛత,నాణ్యత,విలువను ఖచ్చితంగా అంచనా వేయగల నైపుణ్యం,అనుభవం కలిగి ఉండాలని,బ్యాంకులు,సహకార సంఘాలు,లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో గోల్డ్ అప్రైజర్గా పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందన్నారు.

అర్హులైన ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు బయోడేటా,తాజా పాస్పోర్ట్ సైజు ఫోటో,విద్యార్హతల ధ్రువపత్రాలు,అనుభవ ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు ప్రతులు,ఇతర సంబంధిత పత్రాలను ఈనెల 24 సోమవారం లోపు కార్యాలయ పని వేళల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం తాడిచెర్ల కార్యాలయంలో సమర్పించవలెనమన్నారు.అభ్యర్థుల ఎంపిక అర్హతలు, అనుభవం ఇంటర్వ్యూ ఆధారంగా సంఘం నిర్ణయించిన విధంగా నిర్వహించబడుతుందని,దరఖాస్తులను ఆమోదించుట లేదా తిరస్కరించుటపై సంఘానికి పూర్తి హక్కు ఉంటుందన్నారు.మరిన్ని వివరాల కోసం కార్యాలయ పని వేళల్లో సంఘ కార్యాలయాన్ని సందర్శించవచ్చన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -