Tuesday, August 18, 2026
E-PAPER
Homeఆటలుఇక నుంచి 
తెలుగు బ్లాక్‌‌హాక్స్‌

ఇక నుంచి 
తెలుగు బ్లాక్‌‌హాక్స్‌

- Advertisement -

హైదరాబాద్‌ ‌బ్లాక్‌‌హాక్స్‌ ‌పేరు మార్పు
నవతెలంగాణ-హైదరాబాద్‌ :
ప్రైమ్‌ ‌వాలీబాల్‌ ‌లీగ్‌ (‌పీవీఎల్‌) ‌ప్రాంఛైజీ హైదరాబాద్‌ ‌బ్లాక్‌‌హాక్స్‌ ఈ సీజన్‌ ‌నుంచి కొత్త పేరుతో బరిలోకి దిగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ‌వాలీబాల్‌ ‌క్రీడాకారులు, అభిమానులు, ప్రజలకు మరింత చేరవయ్యేందుకు జట్టు పేరును ‘తెలుగు బ్లాక్‌‌హాక్స్‌’గా మార్పు చేసింది. ఈ మేరకు ప్రాంఛైజీ యజమాని కంకణాల అభిషేక్‌ ‌రెడ్డి వెల్లడించారు.
​ఐదో సీజన్‌‌కు సరికొత్తగా.. :
పీవీఎల్‌ ఐదో సీజన్‌‌కు తెలుగు బ్లాక్‌‌హాక్స్‌ ‌గెలుపు గుర్రాలను కొనుగోలు చేసింది. సోమవారం గోవాలో జరిగిన పీవీఎల్‌ ఆటగాళ్ల వేలంలో తనీశ్‌ ‌చౌదరిని రూ.14 లక్షలకు దక్కించుకుంది. వినిత్‌ ‌కుమార్‌ (8 లక్షలు), మౌహ్సిన్‌ (5 ‌లక్షలు), నియాస్‌ (4 ‌లక్షలు), దీపక్‌ (3 ‌లక్షలు) ఆకర్షణీయ మొత్తం దక్కించుకున్నారు. వరంగల్‌ ఆటగాడు మట్టు సిరిల్‌ ‌రెడ్డి రూ.1 లక్షకు తెలుగు జట్టు సొంతమయ్యాడు.
​తెలుగు బ్లాక్‌‌హాక్స్‌ ‌జట్టు :
తనీశ్‌ ‌చౌదరి, వినిత్‌ ‌కుమార్‌, మౌహ్సిన్‌ ‌పి.ఎ, నియాస్‌ అబ్దుల్‌ ‌సలామ్‌, హరి ప్రసాద్‌ ‌బి.ఎస్‌, దీపక్‌, మట్టు సిరిల్‌ ‌రెడ్డి, నమిత్‌ ఎం.ఎస్‌, శిఖర్‌ ‌సింగ్‌, జాన్‌ ‌జొసెఫ్‌, దీపు వేణుగోపాల్‌, ప్రీత్‌ ‌కరణ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -