Tuesday, August 18, 2026
E-PAPER
Homeఆటలుఆధిక్యం 178 పరుగులు

ఆధిక్యం 178 పరుగులు

- Advertisement -

మానవ్‌, జడేజా మాయాజాలం
భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ 462/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ 284/10
నవతెలంగాణ-గాలె

శ్రీలంకతో తొలి టెస్టులో టీమ్‌ ఇండియా పట్టు బిగించింది. బ్యాటర్లు మెరవటంతో తొలి ఇన్నింగ్స్‌‌లో 462 పరుగుల భారీ స్కోరు చేసిన భారత్‌.. స్పిన్నర్లు మాయ చేయటంతో శ్రీలంకను తొలి ఇన్నింగ్స్‌‌లో 284 పరుగులకే కుప్పకూల్చారు. వరుసగా మూడో రోజు వర్షం అంతరాయం కలిగించినా.. 79.4 ఓవర్లలో పది వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు 178 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందించారు. సోనల్‌ ‌దినుశ (100, 168 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లు) సెంచరీతో చెలరేగగా, నిరోషన్‌ ‌డిక్వెలా (80, 115 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించాడు.

​ఆ ఇద్దరు మెరువగా
భారత బౌలర్లు మెరవటంతో శ్రీలంకకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌ ‌నిశాన్‌ ‌ఫెర్నాండో (0)ను సిరాజ్‌ ఇన్నింగ్స్‌ ‌రెండో బంతికే సాగనంపాడు. దినేశ్‌ ‌చండిమాల్‌ (4)‌ను మానవ్‌ ‌సుతార్‌ ‌మాయ చేశాడు. మరో ఓపెనర్‌ ‌లాహిరు ఉదార (27), కామిందు మెండిస్‌ (14), ధనంజయ డిసిల్వ (21) సైతం ఎంతోసేపు నిలువలేదు. 90/5తో శ్రీలంక కష్టాల్లో కూరుకోగా.. సోనల్‌ ‌దినుశ (100), నిరోషన్‌ ‌డిక్వెలా (80) ఆతిథ్య జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌‌కు 126 పరుగుల సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. దినుశ 3 ఫోర్లతో 92 బంతుల్లో అర్థ సెంచరీ సాధించగా, డిక్వెలా ఐదు ఫోర్లతో 67 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడిని పేసర్‌ ‌ప్రసిద్‌ ‌కృష్ణ విడదీశాడు. దీంతో మళ్లీ వికెట్ల జాతర మొదలైంది. 167 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో సెంచరీ సాధించిన దినుశ.. జడేజా మాయకు వికెట్‌ కోల్పోయాడు. జడేజా, మానవ్‌‌ల మాయాజాలంతో టెయిలెండర్లు తోకముడిచారు. నువాంత (2), జయసూర్య (10), కుమార (10), ఫెర్నాండో (0 నాటౌట్‌) ‌తేలిపోయారు. 61.3 ఓవర్లలో 236/5తో నిలిచిన శ్రీలంక.. 79.4 ఓవర్లలో 284 పరుగులకు కుప్పకూలింది. దీంతో భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌లో 178 పరుగుల భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది. స్పిన్నర్లు మానవ్‌ ‌సుతార్‌ (4/76), రవీంద్ర జడేజా (3/57) వికెట్లు పడగొట్టారు. అంతకుముందు, భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌‌లో 462 పరుగులకు ఆలౌటైంది. కుల్‌‌దీప్‌ (13), ప్రసిద్‌ (2) ఓవర్‌‌నైట్‌ ‌స్కోరుకు రెండు పరుగులే జోడించారు.

​స్కోరు వివరాలు :
భారత్‌ ‌తొలి ఇన్నింగ్స్‌ : 462/10
శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌ : మధుష్క (సి) పడిక్కల్‌ (‌బి) సిరాజ్‌ 0, ఉదార (సి) జైస్వాల్‌ (‌బి) మానవ్‌ 27, చండిమాల్‌ (‌సి) పంత్‌ (‌బి) మానవ్‌ 4, మెండిస్‌ (‌సి) గిల్‌ (‌బి) కుల్‌‌దీప్‌ 14, డిసిల్వ (సి) రాహుల్‌ (‌బి) జడేజా 21, దినుశ (ఎల్బీ) జడేజా 100, డిక్వెలా (సి) పంత్‌ (‌బి) ప్రసిద్‌ 80, నువాంత (సి) గిల్‌ (‌బి) జడేజా 2, జయసూర్య (సి) జురెల్‌ (‌బి) మానవ్‌ 10, కుమార (స్టంప్డ్‌) ‌పంత్‌ (‌బి) మానవ్‌ 10, అసిత నాటౌట్‌ 0, ఎక్స్‌‌ట్రాలు : 16, మొత్తం : (79.4 ఓవర్లలో ఆలౌట్‌) 284.
వికెట్ల పతనం : 1-0, 2-27, 3-53, 4-59, 5-90, 6-236, 7-243, 8-274, 9-274, 10-284.
బౌలింగ్‌ : మహ్మద్‌ ‌సిరాజ్‌ 9-3-29-1, ప్రసిద్‌ ‌కృష్ణ 14-0-47-1, మానవ్‌ ‌సుతార్‌ 21.4-1-76-4, కుల్‌‌దీప్‌ ‌యాదవ్‌ 14-0-65-1, రవీంద్ర జడేజా 21-5-57-3.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -