విద్యారంగా సమస్యలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తాం: ఎన్ ఎస్ యుఐ.

నవతెలంగాణ- డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లో విద్యారంగా సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందజేస్తామని ఎన్ ఎస్ యుఐ యూనివర్సిటీ అద్యక్షులు కోమిర శ్రీ శైలం అన్నారు.శుక్రవారం యూనివర్సిటీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ సందర్భంగా  కొమిర శ్రీశైలం మాట్లాడుతూ యూనివర్సిటీలో ఉన్న నిధుల సమస్య, బోధన, బోధనేతర సిబ్బంది సమస్య, అవినీతి అక్రమాలపైన, ఇతర సమస్యలు ఉన్న మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రభుత్వం దృష్టికి మా వంతుగా తీసుకెళ్తామని పేర్కొన్నారు.యూనివర్సిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎన్ ఎస్ యు ఐ ఉపాధ్యక్షుడు చౌదర్పల్లి మహేష్, ప్రధాన కార్యదర్శిలు రాజేందర్, సాగర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love