– సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన తొలి తెలంగాణ అమరవీరుడుని దొడ్డి కొముర య్య అని సొసైటీ మాజీ చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి అన్నారు. శుక్రవారం దొడ్డి కొముర య్య జయంతి సందర్బంగా మండలంలోని గుడి కందుల గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరిం చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ భగత్ సింగ్ గా పిలువబడే దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని కురు మ సంఘం నాయకులు గ్రామంలో ఏర్పాటు చేయ డం చాలా సంతోషకరం అన్నారు. భూస్వాములకు వ్యతిరేకంగా ఆనాడు దొడ్డి కొమురయ్య పోరాటం చేసిన తొలి తెలంగాణ అమరవీరుడుని గుర్తు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాలలో, గ్రామాలలో మహానీయుడు దొడ్డి కొమురయ్య విగ్రహం లేక పోవడం బాధాకరమన్నారు. ఉద్యమాల గడ్డ గుడికందుల గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయ డం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్య క్రమంలో కురుమ ఉద్యోగుల సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు కంతుల లక్ష్మణ్, ఉప సర్పంచ్ పర్ష య్య, మాజీ ఉప సర్పంచ్ మల్లుగారి శ్రీకాంత్ రెడ్డి, కుర్మ సంఘం నాయకులు, వార్డు సభ్యులు, గ్రామ స్తులు తదితరులు పాల్గొన్నారు.



