నవతెలంగాణ-నవాబు పేట
అనగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మార్కెట్ కమిటీ చైర్మన్ హరలింగం, పీఏసీఎస్ చైర్మన్ మాడెమోని నర్సింహులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి ఉత్సవాల సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరుడు, ప్రజా నాయకుడని కొనియాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పాపన్న గౌడ్ చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమని, పాపన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాణెం సుధాకర్ గ్రామ సర్పంచ్ గీతారాణి సుధాకర్ చారి మాజీ జడ్పీటీసీ, గౌడ్ సంఘం నాయకులు దేపల్లి వెంకటేష్ గౌడ్ గోపాల్ గౌడ్ కృష్ణ గౌడ్ మాజీ సర్పంచ్ లు మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆరెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



