నవతెలంగాణ-రాయపర్తి
మండల కేంద్రమైన రాయపర్తిలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి పురస్కరించుకొని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 17వ శతాబ్దంలోనే నిజాంలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు.
పేదల కోసం, అణగారిన వర్గాల కోసం తన ప్రాణాలనుసైతంలెక్కచేయకుండా పోరాడిన మహనీయుడు పాపన్న అని గుర్తు చేశారు.ఆయన ఆశయాలను, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గౌడ కులస్తులంతా ఐక్యంగా ఉండి ఆయన చూపిన బాటలో నడవాలన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షులు పెద్దగోని సంపత్ గౌడ్, బూరుగు మల్లయ్య గౌడ్, కారుబోతుల రామచందర్ గౌడ్, పెదగొని సురేందర్ గౌడ్, బొమ్మెర కళ్యాణ్ గౌడ్, పెద్దగాని వరప్రసాద్ గౌడ్, గాజుల కర్ణాకర్ గౌడ్ , నారగోని నరసయ్య గౌడ్, జొనుగోని శ్రీనివాస్ గౌడ్, చేగొండ సాయి గౌడ్, నాయకులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.



