Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి సింగిల్ విండోను సందర్శించిన డిసిఓ రామ్మోహన్

డోంగ్లి సింగిల్ విండోను సందర్శించిన డిసిఓ రామ్మోహన్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
కామారెడ్డి జిల్లా డి సి ఓ రామ్మోహన్ మంగళవారం డోంగ్లి సింగల్ విండో ను సందర్శించారు. సింగిల్ విండో పరిధిలో కొనసాగుతున్న ఎరువుల స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈపాస్ మిషన్ గురించి ఫర్టిలైజర్ మందుల అమ్మకాల గురించి పరిశీలిస్తూ ఈ పాస్ గురించి అవగాహన కల్పించారు. వ్యవసాయ రైతులకు ఈపాస్ గురించి తెలియజేయాలని సూచించారు. ఆన్లైన్ అమ్మకాలపై ఆరా తీశారు. కార్యదర్శి బాబురావు, సింగిల్ విండో సిబ్బంది పనితీరుపై డి సి ఓ అభినందించారు. ఆయన సందర్శన కార్యక్రమంలో డోంగ్లి సింగిల్ విండో కార్యదర్శి బాబురావు సింగిల్ విండో సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -