నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని ముళ్ళంగి గ్రామ సమీపంలో ప్రమాదంకరంగా ఉన్న గుంతలను మంగళవారం సర్పంచ్ సుదం శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో సిమెంట్, కాంక్రీట్ తో పుడ్చి వేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. మోపాల్, కంజర్ నుండి డిచ్ పల్లి మండల కేంద్రానికి మద్యలో ఉన్న ముళ్ళంగి గ్రామానికి పలు చోట్ల వర్షాల నేపథ్యంలో గుంతలు ఏర్పడ్డాయని, గ్రామానికి రాకపోకలు సాగించే ద్విచక్ర వాహనదారులు ప్రమాదవశాత్తు జారిపడుతున్నారని చెప్పారు. ఇకపై ఎవరూ ప్రమాదాలకు గురి కావొద్దనే ఉద్ధేశ్యంతో గుంతలను పూడ్చివేయించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నితీన్, పంచాయతీ కార్యదర్శి అశ్వంత్ కుమార్ తోపాటు పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రమాదకర గుంతలను పూడ్చాలి..
డిచ్ పల్లి మండల కేంద్రం నుండి మోపాల్ మండల కేంద్రానికి వెళ్ళే రాహదారి ప్రమాదకరంగా మారడంతో ఎందరో ద్విచక్ర వాహన దారులు గుంతల్లో పడి గాయాల పాలౌతున్నారని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి, మరమ్మతులు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని గ్రామస్తులు, వాహనదారులు వేడుకుంటున్నారు.



