Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు

కంకర పోశారు.. బీటీ రోడ్డు మరిచారు

- Advertisement -

రెండేండ్ల నుంచి ఇబ్బందులు పడుతున్న గిరిజనులు 
పట్టించుకోని పాలకులు 
నవతెలంగాణ-మిడ్జిల్ 

గిరిజన తండాలకు బిటి రోడ్డు మంజూరు కావడంతో గత రెండు సంవత్సరాల క్రితం మసిగడ్ల పల్లి నుండి-ఈదుల బాయ్ తండా రెండు కిలోమీటర్లు బీటీ రోడ్డు పనులకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రోడ్డు పనులు ప్రారంభించారు. కంకర పోసి వదిలేయడంతో రాళ్లు గుచ్చుకుని నడవలేక గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధుల కొరతతో పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ఈ రోడ్డు ప్రస్తుతం కంకర కుప్పగా మారి ప్రయాణికులకు నరకాన్ని చూపుతోంది. రహదారిపై కంకర రాళ్లు పైకి తేలి కనీసం నడవడానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ తండాలోని గిరిజనులు, పాఠశాల విద్యార్థులు, గర్భిణులు అత్యవసర సమయాల్లో ఈ కంకర రోడ్డుపై ప్రయాణించలేక ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని నడుస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తరచూ ప్రమాదాలకు గురై కిందపడి గాయపడుతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని, నిధులు లేవనే సాకుతో పనులను గాలికొదిలేశారని స్థానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే నిధులు మంజూరు చేసి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని గిరిజనుల డిమాండ్ చేస్తున్నారు.

 ప్రత్యేక నిధులతో ఈ అంతర్గత రహదారిని బీటీ రోడ్డుగా మారుస్తామని నాడు హామీ ఇచ్చారు. అయితే, శంకుస్థాపన ముగిసి రెండేళ్లు గడుస్తున్నా.. నేటికీ ఎస్టీ మాడ నిధులు విడుదల కాకపోవడంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం కంకర పోసి అలాగే వదిలేయడంతో ఆ రోడ్డు ప్రస్తుతం ప్రయాణ యోగ్యంగా లేకుండా తయారైంది. నాణ్యమైన బీటీ రోడ్డు వస్తుందని వస్తుందనుకుంటే కంకరరోడ్డే దిక్కైంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, నిధులు విడుదల చేయించి ఈ బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయించాలని తండావాసులు  డిమాండ్ చేస్తున్నారు.

ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినా, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల సాధనలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని వారు మండిపడుతున్నారు. రహదారిపై కంకర తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా, గిరిజన గ్రామాల సమస్యలపై అధికారులకు కనీస పట్టింపు లేదని స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగినా కేవలం నిధుల సాకు చెప్తూ కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా, తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయించకపోతే తండావాసులందరితో కలిసి పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని గిరిజన నాయకులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

మసి గుండ్లపల్లి ఈదుల బాయ్, తాండ, మాసుగుండ్లపల్లి రోడ్డు పనుల నిలిచిపోవడానికి నిధుల కొరతే ప్రధాన కారణమని తెలిపారు. బడ్జెట్ మంజూరు కాలేదు, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రభుత్వం నుండి ఇంకా విడుదల కాలేదు. ఉన్నతాధికారులకు నివేదిక బడ్జెట్ కొరత మరియు పనుల పురోగతిపై ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన నివేదికను పంపించాము. నిధులు మంజూరైన వెంటనే కాంట్రాక్టర్ ద్వారా నిలిచిపోయిన బీటీ రోడ్డు పనులను ప్రారంభిస్తామని మాడ ఏఈ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -