నవతెలంగాణ – మల్హర్ రావు
రేపు (బుధవారం) రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జిల్లా ఇంఛార్జి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎస్సి, ఎస్టీ అండ్ వెల్పేర్ శాఖ మంత్రి అడ్డురి లక్ష్మణ్ కుమార్ ఉదయం 10:30 నిమిషాలకు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసి 12:00 పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. మధ్యాహ్నం 2 గంటలకు మంథనిలోని గంగాపురి వద్ద ఎన్ఏసి స్కిల్ డెవలప్మెంట్ బిల్లింగ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం పెట్రోల్ బంక్ చౌరస్తా వద్ద 2-20 గంటలకు నాలుగు మండలాలకు సంబంధించి 9 గ్రామాలకు (మైదుపల్లి,ఎక్లాస్ పూర్, గుంజపడుగు, అడవి సోమన్ పల్లి, కేశనపల్లి, మచ్చుపేట, సుందిళ్ళ, కమాన్ పూర్, రాణాపూర్) సిఎస్ఆర్ క్రింద 9 వైకుంఠ రథాలను మంథని పెట్రోల్ బంక్ వద్ద 9 గ్రామాల సర్పంచ్లు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభోత్సవం చేస్తారు.
మధ్యాహ్నం 2:30 నిమిషాలకు మంథని బస్ డిపో వద్ద రూ.164 కోట్ల 64 లక్షలకు సంబంధించిన పలు రోడ్లను తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తారు. మంథని టౌన్ లో బ్రిడ్జి రోడ్ నుండి బస్ డిపో వరకు వెడల్పు డ్రైన్ నిర్మాణానికి గాను రూ. 15 కోట్ల సెంట్రల్ లైటింగ్ కు రూ.కోటి 20 లక్షలు, గాంధీచౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు రోడ్డు వెడల్పు సెంట్రల్ లైటింగ్ రూ.59 లక్షలు, అంబేద్కర్ చౌక్ నుండి ముత్యాలమ్మ టెంపుల్ వరకు రోడ్డు వెడల్పు రూ.35 లక్షలు, క్యాంప్ ఆఫీస్ రోడ్డు రూ.50 లక్షలు ఇతర అన్ని వార్డులలో రూ.9 కోట్లతో టౌన్ లో రోడ్లు శంకుస్థాపనలు చేస్తారు. మంథని డిపో నుండి డిగ్రీ కాలేజ్ వరకు రూ.21 కోట్లు సిఆర్ఏప్ నిధులతో శంకుస్థాపనలు చేస్తారు.
మంథని డిపో నుండి గోదావరి వరకు 4 లైన్ రోడ్డు 2 కిలోమీటర్లు వెడల్పు రూ. 22 కోట్లు నిధులతో శంకుస్థాపనలు చేస్తారు. సూరయ్య పల్లె నుండి వయా కాకర్ల పల్లె మీదుగా సీతంపేట వరకు రోడ్డు వెడల్పు 10.8 కిలోమీటర్లు రూ. 29 కోట్ల 94 లక్షలు నిధులతో శంకుస్థాపనలు, గుంజపడుగు నుండి వయా ఉప్పట్ల మీదుగా విలోచవరం వరకు 10.9 కిలోమీటర్లు రోడ్డు రూ.8 కోట్ల 78 లక్షలు నిధులతో శంకుస్థాపనలు, కూనారం టు ముత్తారం రోడ్డు 18 కిలోమీటర్లు రోడ్డు రూ. 36 కోట్ల 28 లక్షలు నిధులతో శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పలు అభివృద్ధి కార్యక్రమాల సంబంధించిన నాలుగు మండలాల రేషన్ (స్మార్ట్) కార్డు పంపిణీ, కళ్యాణలక్ష్మి/ షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్, మైనార్టీ కుట్టుమిషన్లు, మహిళ స్వశక్తి సంఘాలకు చెక్కుల పంపిణీ సంబంధించిన పంపిణీ చేసు పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. 4-30 నిమిషాలకు రామగుండంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.



