– సౌత్ ఇండియా చైర్మన్‌గా నందూ నాయక్
నవతెలంగాణ-సత్తుపల్లి
సామాజిక సేవలకు గుర్తింపుగా స్పాట్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ-కరప్షన్ అసోసియేషన్‌లో పలువురికి నూతన బాధ్యతలు అప్పగించారు. సంస్థ పట్ల సభ్యుల కృషి, విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ పదోన్నతులు చేపట్టినట్లు ప్రతినిధులు తెలిపారు. సౌత్ ఇండియా చైర్మన్‌గా సత్తుపల్లికి చెందిన బానోతు నందు నాయక్ , తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్‌గా బానోత్ వీరప్రతాప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్‌గా బారూడి ప్రవీణ్ కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నూనావత్ శ్రీను, సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ బీ. వీరన్న, వైస్ చైర్మన్ పి. రామారావు, నేషనల్ డైరెక్టర్ ఎం. వీరాస్వామి, నేషనల్ లీగల్ చైర్మన్ సందీప్ కుమార్ నిర్ణయం మేరకు ఈ నియామకాలు జరిగాయి. స్టేట్ చైర్మన్ వెంకన్న నాయక్ ఆశయాలకు అనుగుణంగా నూతన సభ్యులు మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు.
స్పాట్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్‌లో నియామకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



