Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పరిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించాలి: సీఐటీయూ

పరిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కరించాలి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు 
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారిని పర్మినెంట్ చేయాలని తెలంగాణ గ్రామ పంచాయతి ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ సీఐటీయూ మండల కార్యదర్శి బానోతు వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పలు సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో కుమార్ కు వినతి పత్రాన్ని అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశుద్ధ కార్మికుల ను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్పంచులు వేధింపులు తక్షణమే ఆపాలనీ, పలు డిమాండ్ల మీద ధర్నా నిర్వహించి ఎంపీడీవో కుమార్ కు వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. అదేవిధంగా బుధవారం కూడా ధర్నా నిర్వహిస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో హెచ్ మల్లయ్య, వీరస్వామి, వెల్తురు కృష్ణ, హెచ్ విజయ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -