నాగార్జున, మణిరత్నం కాంబోలో వచ్చిన ఆల్ టైం క్లాసిక్ ‘గీతాంజలి’. నాగార్జున బర్త్‌డే సందర్భంగా తెలుగు, తమిళంలో శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా బూర్లె శివ ప్రసాద్ 4కే ఫార్మాట్‌లో ఈనెల 28న వరల్డ్‌వైడ్ రీ-రిలీజ్ చేయబోతున్నారు. నాగార్జున ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌లో ఒకటి’ గీతాంజలి’. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ క్లాసిక్ లవ్‌స్టోరీ ఇప్పుడు మరోసారి థియేటర్లలో తన మ్యాజిక్‌ను చూపించడానికి రెడీ అవుతోంది. ఈనెల 28న నాగార్జున బర్త్‌డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ కానుంది. రక్షాబంధన్ స్పెషల్ కూడా కావడంతో ఈ రీ-రిలీజ్ మరింత ప్రత్యేకంగా మారింది. శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివ ప్రసాద్ ఈ ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌ను లేటెస్ట్ టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘గీతాంజలి’ అంటే ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తొచ్చేది అందమైన ప్రేమకథ, మనసును తాకే సంగీతం, అద్భుతమైన విజువల్స్, గుర్తుండిపోయే పెర్ఫార్మెన్స్. నాగార్జునను ఎంతో చార్మింగ్‌గా, ఎమోషనల్‌గా చూపించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. మణిరత్నం తనదైన స్టోరీ టెల్లింగ్‌తో ఈ ప్రేమ కథను ఒక అందమైన కవితలా తెరకెక్కించారు. ఇళయరాజా అందించిన సంగీతం సినిమాకు మరో బలంగా నిలిచి ‘గీతాంజలి’ని క్లాసిక్‌గా మార్చింది. నాగార్జున సరసన గిరిజ హీరోయిన్‌గా నటించారు.
‘గీతాంజలి’ రీ- రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



