6-1తో భారత్ ఘన విజయం
మహిళల హాకీ ప్రపంచకప్
ఆమ్‌స్టల్‌వీన్ : మహిళల హాకీ ప్రపంచకప్‌లో భారత్ అతిపెద్ద విజయం సాధించింది. మంగళవారం జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను టీమ్ ఇండియా చిత్తు చేసింది. ఆరుగురు మెరవటంతో దక్షిణాఫ్రికాపై భారత్ గోల్స్ వర్షం కురిపించారు. తొలి క్వార్టర్‌లో 1-0, రెండో క్వార్టర్‌లో 3-0తో ముందంజలో నిలిచిన భారత్.. మూడో క్వార్టర్‌లో 6-0, నాల్గో క్వార్టర్‌లో 6-1తో అదిరే విజయం అందుకుంది. 11వ నిమిషంలో సునెలిట, 17వ నిమిషంలో నవనీత్ కౌర్, 25వ నిమిషంలో సుశీలా చాను, 38వ నిమిషంలో దీపికా, 44వ నిమిషంలో లాల్‌రెమిసియామి, 45వ నిమిషంలో సాక్షి రాణాలు గోల్స్ కొట్టారు. ఈ విజయంతో గ్రూప్-డిలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై చైనా 4-2తో నెగ్గటంతో.. మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో భారత్ డ్రా చేసుకుంటే తర్వాతి రౌండ్‌కు చేరుకోనుంది.



