Wednesday, August 19, 2026
E-PAPER
Homeఆటలులక్ష్యసేన్‌ శుభారంభం

లక్ష్యసేన్‌ శుభారంభం

- Advertisement -

ప్రీ క్వార్టర్స్‌‌లో గాయత్రి, ట్రెసా జోడీ
బిడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌

నవతెలంగాణ-న్యూఢిల్లీ
బిడబ్ల్యూఎఫ్‌ ‌ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌‌లో 14వ సీడ్‌, భారత స్టార్‌ ‌షట్లర్‌ ‌లక్ష్యసేన్‌ ‌తొలి రౌండ్లో గట్టెక్కాడు. మంగళవారం న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్‌‌స్టేడియంలో జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ ‌మ్యాచ్‌‌లో ఆస్ర్టియా ఆటగాడు కొలిన్స్‌ ‌వాలంటైన్ ఫిలిమాన్‌‌పై లక్ష్యసేన్‌ 16-21, 21-8, 21-4తో మూడు గేముల మ్యాచ్‌‌లో గెలుపొందాడు. తొలి గేమ్‌‌లో 16-21తో తడబడిన లక్ష్యసేన్‌ 15 ‌నిమిషాల్లో కంగుతిన్నాడు. కానీ ఆ తర్వాత వరుస గేములను అలవోకగా 30 నిమిషాల్లోనే నెగ్గాడు. తొలి గేమ్‌, తర్వాతి రెండు గేమ్‌‌ల్లో భిన్నమైన ఆటతీరుతో లక్ష్యసేన్‌ ‌ప్రపంచ చాంపియన్‌‌షిప్స్‌‌ను విజయంతో మొదలెట్టాడు. మహిళల సింగిల్స్‌‌లో ఉన్నతి హుడా సైతం తొలి రౌండ్లో అలవోక విజయం సాధించింది. మయన్మార్‌ ‌షట్లర్‌ ‌తుజార్‌‌పై 22-20, 21-16తో ఉన్నతి హుడా 40 నిమిషాల్లోనే రెండో రౌండ్‌‌కు చేరుకుంది. మహిళల డబుల్స్‌‌లో గాయత్రి, ట్రెసా జోడీ 21-15, 21-12తో 16వ సీడ్‌ అమెరికా జోడీ లారెన్‌, అలిసన్‌‌లను వరుస గేముల్లో మట్టికరిపించి ప్రీ క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించారు. కవిప్రియ, సిమ్రన్‌ ‌సింఘి జంట 7-21, 14-21తో రెండో రౌండ్ల నిరాశపరచగా, మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో అసిత్‌ ‌సూర్య, అమృత జోడీ 21-16, 29-30, 22-24తో పోరాడి ఓడింది. ‌రోహన్‌ ‌కపూర్‌, రుత్విక శివాని జంట సైతం 22-20, 10-21, 17-21తో మూడు గేముల మ్యాచ్‌‌లో పోరాడి ఓడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -