నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులకు మద్దతుగా, పేపర్ లీక్ లను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రతిపక్ష నేత ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ బుధవారం రాజ్‌భవన్ మార్చ్ కు పిలుపునిచ్చారు. రాజ్ భవన్ వైపు దూసుకొస్తున్న ఆర్జేడీ శ్రేణులపై పోలీసులు జల ఫిరంగులతో దాడి చేశారు. ఆ తర్వాత తేజస్వి యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్ యువత చైతన్యం పొందిందని, ఈ తరహా ఉద్యమాలను ఎవరూ ఆపలేరని బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. సివాన్ జిల్లాలో గత నెలలో విద్యార్థలునిరసనలపైకి ఏకే-47తో కానిస్టేబుల్ కాల్పులు జరిపిన ఘటనకు నిరసనగా ఆర్జేడీ ఈ మార్చ్ చేపట్టింది. విద్యార్థులపైకి ఏకే-47తో కాల్పులు జరిపినట్లు బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అంగీకరించిందని ఎంపీ మీసా భారతి అన్నారు. AK-47 ఉపయోగించేందుకు ఎవరు అనుమతిచ్చారో కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని ఆమె డిమాండ్ చేశారు.
బీహార్ లో ఉద్రిక్తత..తేజస్వి యాదవ్ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



