Wednesday, August 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఆస్పత్రికి ఇమ్రాన్‌ఖాన్‌..తీర్పును సవాలు చేయనున్న పాక్‌ ప్రభుత్వం

ఆస్పత్రికి ఇమ్రాన్‌ఖాన్‌..తీర్పును సవాలు చేయనున్న పాక్‌ ప్రభుత్వం

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాకిస్తాన్‌ ప్రభుత్వం సవాలు చేయనుంది. ఈ తీర్పు ‘‘చట్టపరిధిలోకి రాదు’’ అని మంగళవారం రాత్రి అధికారిక మీడియా ఎక్స్‌లో పోస్ట్‌ చేసిన వీడియో ప్రకటనలో న్యాయశాఖ మంత్రి అజమ్‌ నజీర్‌ తరార్‌ పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినట్లుగా ప్రైవేట్ ఆసుపత్రిలో కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఇమ్రాన్‌ ఖాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ ప్రభుత్వం ఒక సమీక్షా పిటిషన్‌ను దాఖలు చేయనుందని అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు ఈ రకమైన చికిత్సను అందించలేవని, ఆ సేవలను నిర్వహించలేవని నిరూపించే సాక్ష్యాధారాలు లేదా ఆధారాలు సమర్పించినంతవరకు, సాధారణంగా అటువంటి ఏర్పాట్లు చేయరని తరార్‌ పేర్కొన్నారు.


కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ను రెండు రోజుల్లోగా జైలు నుండి ఇస్లామాబాద్‌లోని షిఫా అంతర్జాతీయ ఆస్పత్రికి తరలించాల్సిందిగా సుప్రీంకోర్టులోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. వారానికి ఒకసారి కుటుంబసభ్యులను కలిసేందుకు, వారానికి రెండు సార్లు ఆయన కుమారుడితో ఫోన్‌లో మాట్లాడేందుకు కోర్టు అనుమతించింది. వ్యక్తిగత వైద్యుడు ఫైసల్‌ సుల్తాన్‌,ఇమ్రాన్‌ ఖాన్‌ సోదరి, వైద్యురాలు ఉజ్మా ఖాన్‌లను వైద్య పరీక్ష‍లు, చికిత్సకు అనుమతించింది. ఆస్పత్రి పరిసరాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని, ఆయన ఆరోగ్య సమాచారాన్ని రాజకీయ లబ్థి కోసం వినియోగించకూడదని హెచ్చరించింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లైతే.. ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటామని ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 16కి వాయిదా వేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -