Thursday, August 20, 2026
E-PAPER
Homeతాజా వార్తలుమరో అందమైన ప్రేమకథలో..

మరో అందమైన ప్రేమకథలో..

- Advertisement -

మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో యూత్ లో తనకంటూ ఓ స్పెషల్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో సంగీత్ శోభన్, నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని, డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ కాంబోలో ఓ క్రేజీ మూవీ తెరకెక్కుతోంది. సరికొత్త ట్రెండీ లవ్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తోంది. శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.3 గా నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి లక్ష్మీ భూపాల్ రచయిత. హీరో సంగీత్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభా కాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో మారుతి అనే పాత్రలో సంగీత్ శోభన్ నటిస్తున్నారు. బర్త్ డే పోస్టర్ చూస్తే – బుట్టలో ఆకుకూరలు తీసుకొస్తూ మిడిల్ క్లాస్ అబ్బాయి లుక్ లో సంగీత్ శోభన్ కనిపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -