Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్స్వశక్తి మహిళలకు ఈ-కేవైసీ తప్పనిసరి..!

స్వశక్తి మహిళలకు ఈ-కేవైసీ తప్పనిసరి..!

- Advertisement -

– మండలంలో మహిళా సంఘాలు 707
– సభ్యులు మొత్తం..7,326
– ఈ-కేవైసి పూర్తయినవి 1,247
– ఇంకా పూర్తి కావల్సిన సభ్యులు 5,359
– తుది గడువు ఈ నెల 31
నవతెలంగాణ – మల్హర్ రావు
: మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసి తప్పనిసరి చేసింది ప్రభుత్వం.ఈ మేరకు కొద్ది రోజులుగా ఐకేపీ సిబ్బంది అంతా ఇదే పనిలో నిమగ్నమయ్యారు. మండలంలో మొత్తం 707 స్వశక్తి సంఘాలు ఉన్నాయి. ఇందులో 7,326 మంది సభ్యులుండగా ఇందులో ఈకేవైసి పూర్తియినవారు 1247 మంది మాత్రమే, ఇంకా పూర్తి కావాల్సిన వారు 5,359 ఉన్నారు. తుది గడువు ఈ నెల 31 వరకు వందశాతం పూర్తియ్యేలా అనే సందేహాలు వస్తున్నాయి.ఇప్పటికే మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండగా సభ్యులకు సంబంధించి పక్కా సమాచారం సేకరించడంతో సేవల్లో మరింత పారదర్శకత పెరగనుంది.

పొదుపు సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వ తోడ్పాడుతో పాటు బ్యాంకులు సైతం రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి.గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మహిళలు ఆర్థికాభివృద్ది కోసం స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటుకు ప్రోత్సహిస్తూ ఇందుకు ప్రాత్సాహం అందిస్తున్నాయి.ఇప్పటి వరకు సంఘాల పనితీరు వారి భాగానే ఉన్నాయని భావించిన కేంద్ర,రాష్ట్ర ప్రభు త్వాలు మహిళా సంఘాల కోసం అమలు చేస్తున్న పథకాలు అర్హులకే అందాలన్నా ఆలోచనతో ఈ-కేవైసీ తప్పనిసరి చేసింది. ఇందులో భాగంగా సంఘాల్లోని ప్రతి సభ్యురాలి సమస్త సమాచారాన్ని లోకోస్ యాప్లో నిక్షిప్తం చేశారు.

గ్రామ పంచాయితీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఇలాగే జమ చేస్తుందని, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ ఎం) ద్వారా మహిళల అబివృద్ధికి కేటాయించే నిధులు కూడా దీని పరిథిలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా మహిళా సంఘాల సభ్యులకు చేర్చాలన్నా యోచనలో భాగంగా ఈ-కేవైసీ నమోదు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ-కేవైసీ చేయడం ద్వారా సభ్యుల పక్కా సమాచారం నమోదవుతొందని దీంతో అనర్హులు పొదుపు సంఘాల్లో కొనసాగడం వీలుండదని అధికారులు పేర్కొంటున్నారు.

ఈ-కేవైసీ తప్పనిసరి :ఎపిఎం..హనుమంతరావు
ఫోటో,బ్యాంకు ఖాతాల మహిళా సంఘాల్లోసి సభ్యులందరూ తప్పకుండ ఈ-కేవైసీ చేయించుకోవాలి. మహిళా సంఘాల సంబంధించిన ఆధార్, వివరాలను ఇప్పటికే లోకోస్ యాప్లో నిక్షిప్తం చేశాం.సెర్చ్ ఆదేశాలకు అనుగుణంగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది.ప్రతి సభ్యురాలు వీవోఏ లను కలిసి యాప్లో నమోదు చేయించుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -