– మున్సిపల్ కార్మికులకు రూ. 26 వేలు కనీస వేతనం చెల్లించాలి
నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లి పట్టణంలో ఈ నెల 23, 24 తేదీలలో జరగనున్న ఖమ్మం జిల్లా ఏఐటీయూసీ మహాసభల విజయవంతం కోరుతూ బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన కనీస వేతన జీఓ ప్రస్తుతం కార్మికులు పొందుతున్న వేతనాల కంటే తక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులందరికీ తక్షణమే నెలకు రూ. 26 వేలు కనీస వేతనం చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కార్మికులకు హెల్త్ కార్డులు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు తడికమళ్ల యోబు, అధ్యక్షులు సుధాకర్, ప్రధాన కార్యదర్శి తొగర్త శీను, నాయకులు శ్రీకాంత్, కాంతమ్మ, అలివేలు, పురుషోత్తం, రామారావు పాల్గొన్నారు.
సత్తుపల్లిలో ‘ఏఐటీయూసీ’ మహాసభల ప్రచారం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



