- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు గుడ్న్యూస్. కేంద్ర ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఈ-కేవైసీ పూర్తి చేసుకునే గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్టు సమాచారం. తొలుత ఆగస్టు 16ను గడువుగా నిర్ణయించినప్పటికీ సర్వర్ సమస్యలు, ఓటీపీ ఆలస్యం, బయోమెట్రిక్ ఇబ్బందుల కారణంగా పలువురు కస్టమర్లు కేవైసీ పూర్తి చేయలేకపోవడంతో అదనపు సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్ వినియోగదారులు సమీప ఏజెన్సీలో ఉచితంగా కేవైసీ చేయించుకోవచ్చు. అధికారిక యాప్ల ద్వారా ఆన్లైన్లోనూ ఈ ప్రక్రియ పూర్తి చేసుకునే అవకాశం ఉంది. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.
- Advertisement -



