Friday, August 21, 2026
E-PAPER
Homeజాతీయంసీజేపీ శ్రేణులపై రాజస్థాన్ లో దాడి

సీజేపీ శ్రేణులపై రాజస్థాన్ లో దాడి

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: స్కూల్ టిక్ కరో క్యాంపెయిన్ కు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు నిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీజేపీ ప్రతినిధులు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక వసతులపై ఆరా తీస్తున్నారు. తాజాగా శుక్రవారం రాజస్థాన్ లోని జైపూర్ జిల్లా రామ్ పూర్ కన్వాపూర్ లో స్థానిక ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి వెళ్లిన సీజేపీ ప్రతినిధులపై ఓ గుంపు దాడులు జరిపింది.”బీజేపీ గుండాలు” చేసిన ముందస్తు ప్రణాళికాబద్ధమైన దాడి అని CJP కార్యకర్త అశుతోష్ ఆరోపించారు. అలాగే 48 గంటల్లో నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమండ్ చేశారు.

“బీజేపీ అరాచకత్వాన్ని దేశం మొత్తం ఈ రోజు ప్రత్యక్షంగా చూసిందని, అక్కడ రాళ్ల దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, తాము ఏమీ చేయబోమని పోలీసులు చెప్పారు. ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది. తమ వాలంటీర్ల చేతులు విరిచేశారు. తమ వాహనాలను ధ్వంసం చేశారు. తమ బృందంలోని మహిళలపై రాళ్లు విసిరి, వారి ఫోన్లను పగలగొట్టారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగింది. ఈ గుండాలందరినీ 48 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒక సంవత్సరం నుండి ఆ పాఠశాల గేదెల కొట్టంలో నడుస్తోందని, తాము దానిని బాగు చేయించాలనుకుంటున్నాము. కాని అక్కడ బీజేపీ గుండాలున్నారు… రాజస్థాన్ ప్రజాస్వామ్యంలో ఇది ఒక చీకటి రోజు అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -