Saturday, August 22, 2026
E-PAPER
Homeఖమ్మంఏరియా ఆస్పత్రికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ పేరు పెట్టాలి

ఏరియా ఆస్పత్రికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ పేరు పెట్టాలి

- Advertisement -

– రింగ్‌ రోడ్‌లో జగజ్జీవన్‌రామ్‌ విగ్రహం ఏర్పాటుకు సహకరించాలి
ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు లను కోరిన మాదిగ సామాజిక నాయకులు
నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేటలో నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ ఏరియా ఆస్పత్రిగా నామకరణం చేయాలని, ఆస్పత్రి ప్రాంగణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాదిగ సామాజిక నాయకులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణను కోరారు. ఈ మేరకు శనివారం పార్టీలకతీతంగా అశ్వారావుపేట – పేలాయి గూడెం నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, మున్సిపాలిటీ వైస్ ఛైర్ఫపర్సన్ జూపల్లి రమేష్ బాబు లను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. అశ్వారావుపేటలోని ఎంపీడీవో పూర్వ – ప్రస్తుత కార్యాలయాలు, గిరిజన భవనం, ఐసీడీఎస్‌ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వరకు పలు ప్రభుత్వ భవనాలు పేరాయిగూడెం వాసుల పరిధిలో ఉన్నాయని తెలిపారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి తాము ఎలాంటి డిమాండ్‌ చేయలేదన్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న వంద పడకల ఆస్పత్రికి బాబూ జగజ్జీవన్‌రామ్‌ పేరు పెట్టి న్యాయం చేయాలని కోరారు.

అదేవిధంగా రింగ్‌ రోడ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వెనుక భాగంలో బాబూ జగజ్జీవన్‌రామ్‌ విగ్రహం ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను కోరారు. దీనిపై ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్పందిస్తూ.. తన వంతుగా రెండు కార్యక్రమాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాల సాధన కోసం కౌన్సిలర్లు నార్లపాటి మహేష్‌, నార్లపాటి మౌనిక, నార్లపాటి దివాకర్‌, కోఆప్షన్‌ సభ్యురాలు తగరం నిర్మల పూర్తి బాధ్యత తీసుకోవాలని నాయకులు కోరారు.

ఎమ్మెల్యేను కలిసిన వారిలో జుజ్జారపు రాంబాబు, నార్లపాటి సుబ్బారావు, కలపాల బాబురావు, నార్లపాటి నాగరాజు, నార్లపాటి సోమరాజు, తగరం హరి, గంధం ఆనంద్‌, నార్లపాటి రామకృష్ణ, నార్లపాటి సురేష్‌, నార్లపాటి నవీన్‌, తగరం నాగరాజు, మోటూరి రాజేష్‌, సంతోషం, అయినంపూడి ప్రదీప్‌, నార్లపాటి బన్ను, నార్లపాటి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -