- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలో శనివారం జరగాల్సిన ఉపాధి హామీ పథకం 17వ ప్రజా వేదిక కార్యక్రమం వాయిదా పడినట్లు మండల ఎంపీడీఓ సాయిలు ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు. 2025-26 సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనుల సోషల్ ఆడిట్ కు గ్రామీణ అభివృద్ధి పిడి అనివార్య కారణాలతో హాజరు కాలేకపోయారు. ఈ మేరకు వాయిదా వేసినట్లు ఎంపీడీవో తెలిపారు. తదుపరి ప్రజావేదిక కార్యక్రమం ఎప్పుడు నిర్వహిస్తామనే త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
- Advertisement -



