Saturday, August 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రామారావుపల్లి విద్యార్థులకు షూస్‌ పంపిణీ

రామారావుపల్లి విద్యార్థులకు షూస్‌ పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రంమైన తాడిచర్ల పరిధిలోని రామారావుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం గ్రామ సర్పంచ్ బండి స్వామి, పాఠశాల ప్రాధానోపాధ్యాయురాలు బి.పద్మ సంయుక్తంగా విద్యార్థులకు ఉచితంగా షూస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి వచ్చే ఉచిత పథకాలను ప్రజలు, విద్యార్థులు, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రయివేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం, ఉచిత నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు అందించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి దోహదపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -