Saturday, August 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్చిరంజీవి బర్త్‌డే.. రోగులకు పండ్లు పంపిణీ చేసిన అభిమాని

చిరంజీవి బర్త్‌డే.. రోగులకు పండ్లు పంపిణీ చేసిన అభిమాని

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
ఆగష్టు 22 (శనివారం) మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకల సందర్బంగా మండల కేంద్రమైన కుభీర్ లో చిరంజీవి వీరాభిమాని ఐన శ్రీకల శ్రీనివాస్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఐన శ్రీనివాస్ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి అందరివాడని అన్నారు. ఆయన సినిమా హీరో మాత్రమే కాదనీ, పేదల కోసం, అనారోగ్య బాదితుల కోసం బ్లడ్‌ బ్యాంకు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రియల్‌ హీరో అని ప్రశంసించారు. స్వయం కృషితో ఎదిగిన తొలి తెలుగు అగ్ర కథానాయకుడని వర్ణించాడు. 150కి పైగా సినిమాలతో ఎన్నో ఏండ్లుగా సినీ ప్రియులను, ఆయన అభిమానులను అలరించిన చిరంజీవి భవిష్యత్తులో కూడా మంచి పేక్ష‍కాదరణ పొందే సినిమాలు తీస్తారని ఆశించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న చిరంజీవి అన్నయ్య వీరాభిమానులందరి ఆశీస్సులతో, ఆ దేవుడి కృపతో నిండు నూరేళ్ళు, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో “చిరంజీవిగా” జీవించాలని ఆకాంక్ష‍ించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -