Saturday, August 22, 2026
E-PAPER
Homeఖమ్మంపాముకాటుకు వ్యక్తి మృతి

పాముకాటుకు వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన పండు చిన రాముడు (36) పాముకాటుతో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో తన వరి పొలానికి నీళ్లు పెడుతుండగా పాము కాటుకు గురయ్యాడు. అతనితోపాటు పొలానికి వెళ్లిన రైతులు మొడియం దుర్గారావు, గొంది సిరమయ్యలు రాముడు అరుపులు విని వెంటనే సమీపంలోని పెద్దవాగు ప్రాజెక్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం అశ్వారావుపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే కుటుంబ సభ్యులు రాముడిని మద్దిగట్ల గ్రామానికి తీసుకెళ్లి నాటు వైద్యం చేయించి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఆరోగ్యం విషమించడంతో తిరిగి అశ్వారావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.

దీంతో సత్తుపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి మధ్యాహ్నం 2.10 గంటలకు రాముడు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి అన్న పండు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు ఎస్సై టి. యయాతిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -