నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేరు పట్టణం సమీపంలో ద్విచక్ర వాహనం అజాగ్రత్తగా నడుపుతూ, ప్రమాదానికి గురైన వ్యక్తి, హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్టకు చెందిన నీలం చిన్న (32) శుక్రవారం రాత్రి, శివరాత్రి స్వామితో కలిసి పెళ్లి పత్రికలు పంచిపెట్టి ఇంటికి తిరిగి వెళ్తున్న గ్రామంలో అజాగ్రత్తతో, అతివేగంగా వాహనాన్ని నడపగా.. ఆలేరు పట్టణ సమీపంలోని కోలనుపాక రోడ్డు వద్ద ద్విచక్ర వాహనం స్కిడ్ అయి పడిపోయారు. ఈ ప్రమాదం కారణంగా నేడు నీలం చిన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. శివరాత్రి స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ హెచ్ ఓ, ఎన్ వినయ్ తెలియజేశారు.
గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
- Advertisement -
- Advertisement -



